. 2 minutes

IND vs ENG 2025: 8 ఏళ్ళ తర్వాత రీ ఎంట్రీ: నాలుగో టెస్టుకు ఇంగ్లాండ్ స్క్వాడ్ ప్రకటన

Caption of Image.

టీమిండియాతో జరగబోయే నాలుగో టెస్ట్ కోసం ఇంగ్లాండ్ తమ స్క్వాడ్ ను ప్రకటించింది. ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు (ECB) మంగళవారం (జూలై 15) 14 మంది ఆటగాళ్లతో కూడిన ఇంగ్లాండ్ జట్టును ప్రకటించింది. గాయంతో సిరీస్ కు దూరమైన ఆఫ్ స్పిన్నర్ షోయబ్ బషీర్ స్థానంలో మరో ఆఫ్ స్పిన్నర్ లియామ్ డాసన్‌ను జట్టులోకి చేర్చుకుంది. ఈ ఒక్క మార్పు మినహా కొత్త ఆటగాళ్లెవరూ స్క్వాడ్ లోకి రాలేదు. ఇండియా, ఇంగ్లాండ్ జట్ల మధ్య నాలుగో టెస్టు ఈ నెల 23 నుంచి మాంచెస్టర్‌‌‌‌‌‌‌‌లో జరుగుతుంది. ప్రస్తుతం 3 టెస్ట్ మ్యాచ్ లు జరగగా ఇంగ్లాండ్ 2-1 ఆధిక్యంలో నిలిచింది. 

8 ఏళ్ళ తర్వాత డాసన్ 

డాసన్ 8 ఏళ్ళ తర్వాత ఇంగ్లాండ్ టెస్ట్ స్క్వాడ్ లో స్థానం సంపాదించాడు. బషీర్ లేకపోవడంతో నాలుగో టెస్టుకు డాసన్ కు ఏకైక స్పిన్నర్ గా ప్లేయింగ్ 11 లో చోటు దక్కే అవకాశం ఉంది. చివరిసారిగా జూలై 2017లో ఇంగ్లాండ్ తరఫున డాసన్ టెస్ట్ క్రికెట్ ఆడాడు. 35 ఏళ్ల  ఈ ఆఫ్ స్పిన్నర్ కొన్నేళ్లుగా హాంప్‌షైర్ తరపున నిలకడగా ఆడుతున్నాడు. 2023, 2024లో PCA ప్లేయర్ ఆఫ్ ది ఇయర్‌గా ఎంపికయ్యాడు. ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు స్క్వాడ్ నుంచి పేసర్లు సామ్ కుక్, జామీ ఓవర్టన్‌లను విడుదల చేసింది. వీరిద్దరూ కౌంటీ ఛాంపియన్‌షిప్‌లో ఆడటానికి అనుమతిని ఇచ్చారు. 

🚨 Slow left-armer Liam Dawson will replace injured Shoaib Bashir pic.twitter.com/HvjgUA2nOS

— ESPNcricinfo (@ESPNcricinfo) July 15, 2025

బషీర్ కు గాయం:
 
ఇంగ్లాండ్ ఆఫ్ స్పిన్నర్ షోయబ్ బషీర్ గాయంతో టెస్ట్ సిరీస్ మొత్తానికి దూరమయ్యాడు. టీమిండియాతో జరిగిన మూడో టెస్టులో భాగంగా మూడో రోజు బషీర్ ఎడమ చేతి చిటికెన వేలికి గాయం అయింది. స్కాన్‌ చేస్తే పగుళ్లు ఉండడంతో సర్జరీ అవసరమని డాక్టర్లు సూచించారు. దీంతో నాలుగు, ఐదు టెస్టులకు ఈ ఇంగ్లాండ్ ప్రధాన స్పిన్న దూరమయ్యాడు. టీమిండియా తొలి ఇన్నింగ్స్ 78వ ఓవర్‌లో బషీర్ వేసిన బంతిని జడేజా బలంగా బాదాడు. బంతిని ఆపే క్రమంలో బషీర్ చేతికి బలంగా తగిలింది. దీంతో బౌలింగ్ చేయలేక ఓవర్ మధ్యలోనే బషీర్ గ్రౌండ్ వదిలి వెళ్ళిపోయాడు. మిగిలిన ఓవర్ రూట్ పూర్తి చేశాడు.

ALSO READ : Olympics 2028: జూలై 12న తొలి మ్యాచ్.. 2028 ఓలింపిక్స్ క్రికెట్ షెడ్యూల్ విడుదల

విరిగిన వేలు తోనే బషీర్ నాలుగో రోజు బ్యాటింగ్ కు వచ్చాడు. ఐదో రోజు కూడా జట్టు కోసం గాయంతోనే బౌలింగ్ చేశాడు. ఐదో రోజు తీవ్ర ఉత్కంఠ సమయంలో సిరాజ్ వికెట్ తీసి బషీర్ ఇంగ్లాండ్ కు చివరి వికెట్ అందించాడు. దీంతో ఇంగ్లాండ్ థ్రిల్లింగ్ విక్టరీ కొట్టింది. 

టీమిండియాతో 4వ టెస్ట్ కు ఇంగ్లాండ్ స్క్వాడ్:

బెన్ స్టోక్స్ (కెప్టెన్), జోఫ్రా ఆర్చర్, గస్ అట్కిన్సన్, జాకబ్ బెథెల్, హ్యారీ బ్రూక్, బ్రైడాన్ కార్స్, జాక్ క్రాలే, లియామ్ డాసన్, బెన్ డకెట్, ఓల్లీ పోప్, జో రూట్, జామీ స్మిత్ (వికెట్ కీపర్), జోష్ టంగ్, క్రిస్ వోక్స్.

©️ VIL Media Pvt Ltd.
Disclaimer : This story is auto aggrigated by a computer program and has not been created or edited by this website. All copyrights related to this news are owned by those websites. This website is not to be held responsible for any of the content displayed.