
నితిన్ యాక్షన్ డ్రామా తమ్ముడు (జులై 4న) థియేటర్లలో విడుదలై ఘోరంగా విఫలమైంది. బాక్సాఫీస్ వద్ద అంచనాలను అందుకోలేకపోవడంతో డిజాస్టర్‌గా నిలిచింది. ఈ క్రమంలో నెల రోజులు కూడా తిరగకుండానే తమ్ముడు ఓటీటీలోకి ఎంట్రీ ఇస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది.
నివేదికల ప్రకారం,
తమ్ముడు స్ట్రీమింగ్ హక్కులను నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. ఓటీటీలోకి వీలైనంత త్వరగా తీసుకురావాలని నెట్‌ఫ్లిక్స్ ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే, ఆగస్టు 1,2025న ప్రీమియర్ అయ్యే అవకాశం ఉందని టాక్ మొదలైంది.
ALSO READ : OTT Movies: ఈ వీకెండ్ (జూలై 16-20) ఓటీటీలోకి ఏకంగా 20కి పైగా సినిమాలు.. తెలుగులో 3 ఇంట్రెస్టింగ్..
సాధారణంగా, పెద్ద తెలుగు సినిమాలు థియేటర్లలో విడుదలైన కనీసం ఒక నెల తర్వాతే, ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతాయి. కానీ ‘తమ్ముడు’ విషయంలో అలా జరగడం లేదు. అనుకున్నదానికంటే ముందుగానే అడుగుపెడుతుంది. స్ట్రీమింగ్ విషయంపై నెట్‌ఫ్లిక్స్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. అయితే, ఈ సినిమా డిజిటల్ వెర్షన్‌పై ఆడియన్స్లో పెద్దగా ఇంట్రెస్ట్ కనిపించట్లేదు. కాకపోతే, థియేటర్లలో చూడని ప్రేక్షకులు ఓటీటీలో చూసేందుకు ఆసక్తి చూపే అవకాశం కనిపిస్తోంది.
#Thammudu OTT Release Date Buzz –
According to the reports, the film is likely to premiere on Netflix on August 1, 2025. However, an official announcement is still awaited. pic.twitter.com/N86Ex0SRDz
— Cinema Mania (@ursniresh) July 16, 2025
ఇకపోతే, డైరెక్టర్ వేణు శ్రీరామ్ రాసుకున్న కథకు ప్రేక్షకులు ఏ మాత్రం కనెక్ట్ అవ్వలేకపోయారు. ‘తమ్ముడు’ సినిమా సుమారు రూ.40 కోట్ల బడ్జెట్‌తో నిర్మించబడింది. ప్రమోషన్స్తో కలిపి దాదాపు రూ.50 కోట్లపైనే ఖర్చు పెట్టినట్లు తెలుస్తోంది. కానీ, తమ్ముడు బాక్సాఫీస్ దగ్గర కేవలం రూ.6కోట్లు మాత్రమే వసూలు చేసింది. ఇలా ‘తమ్ముడు’తో నితిన్కు వరుసగా నాలుగో ఫ్లాప్ ఎదురైంది. ఓ రకంగా ఇది నితిన్ కెరీర్కు పెద్ద దెబ్బే అని చెప్పాలి.
‘తమ్ముడు’ కథ:
ఆర్చరీలో గోల్డ్ మెడల్ కొట్టాలన్నది జై (నితిన్) లక్ష్యం. కానీ చిన్నప్పుడు తను చేసిన తప్పు వల్ల అక్క (లయ) దూరం అయిందనే గిల్ట్తో టార్గెట్ పై ఫోకస్ పెట్టలేకపోతాడు. దీంతో చిత్ర (వర్ష బొల్లమ్మ)తో కలిసి అక్కను వెతుక్కుంటూ వైజాక్ వెళ్తాడు. ఆమెతో “తమ్ముడు” అని పిలిపించుకోవాలి అనుకుంటాడు. ఆంధ్రా, ఛత్తీస్ గడ్ బోర్డర్ లోని అడవిలో ఉన్న అంబర గొడుగులో అమ్మవారి మొక్కు చెల్లించుకునేందుకు ఆమె ఫ్యామిలీతో కలిసి వెళ్తుంది.
గవర్నమెంట్ ఆఫీసర్ అయిన ఆమెను కుటుంబంతో సహా చంపేందుకు పారిశ్రామిక వేత్త అజర్వాల్ (సౌరబ్ సచదేవ్) మనుషులు వెంట పడుతుంటారు. వాళ్ళు ఎందుకు తనను చంపాలి అనుకున్నారు, వాళ్ల నుండి తన అక్క కుటుంబాన్ని జై ఎలా కాపాడుకున్నాడు.. ఇందుకు రత్న (సప్తమి గౌడ) ఎలా సహాయపడింది.. ఇందులో గుత్తి (స్వసిక) పాత్ర ఏమిటి అనేది మిగతా కథ.