. < 1 minute

Rashmika : ‘ది గర్ల్‌ఫ్రెండ్‌’.. రష్మిక, దీక్షిత్‌ల కెమిస్ట్రీతో ఆకట్టుకుంటున్న ‘నదివే’ సాంగ్!

Caption of Image.

దీక్షిత్ శెట్టి (  Deekshith Shetty ), రష్మిక మందన  (Rashmika Mandanna) ప్రధాన పాత్రలో నటించిన రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌ చిత్రం ‘ది గర్ల్‌ఫ్రెండ్‌’ (The Girlfriend).  రాహుల్‌ రవీంద్రన్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీపై ఇప్పటికే సినీ ప్రియుల్లో ఆసక్తి నెలకొంది.  ప్రమోషన్స్ లో భాగంగా చిత్రం బృందం అందులోని తొలిపాట’ నదివే’ వీడియో ( Nadhive Music Video )ను బుధవారం ( జూలై 16, 2025 )న విడుదల చేసింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ పాట వైరల్ గా మారింది. 

ఈ పాటను హేషమ్ అబ్దుల్ వహాబ్ స్వీయ సంగీత దర్శకత్వంలో ఆలపించారు.  ఆయన స్వరం పాటలోని భావోద్వేగాలను మరింత పెంచింది.  ప్రఖ్యాత గేయ రచయిత రాకేందు మౌళి అందించిన సాహిత్యం మనసును హత్తుకునే ఉంది.  పాటతో పాటు నృత్యం ఆకట్టుకుంటున్నాయి.  ప్రేమలో లోతును , అనుబంధాన్ని వర్ణించే పదాలు శ్రోతలను మంత్రమగ్ధులను చేస్తున్నాయని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.

 

ఈ ‘నదివే’ పాట వీడియోలో రష్మిక, దీక్షిత్‌ శెట్టిల డ్యాన్స్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. వీరిద్దరి మధ్య ఉన్న కెమిస్ట్రీ తెరపై స్పష్టంగా కనిపిస్తుంది. రష్మిక తన సహజమైన నటనతో, ఆకర్షణీయమైన డ్యాన్స్‌తో మరోసారి మెప్పించింది. దీక్షిత్‌ కూడా రష్మికకు తగ్గట్టుగా అద్భుతంగా పర్ఫార్మ్ చేశారు. వీరిద్దరూ కలిసి ప్రేమలో తడిసి ముద్దవుతున్నట్లుగా, ఒకరికొకరు తోడుగా నిలుస్తున్నట్లుగా ఈ పాటలో కనిపించారు. దృశ్యపరంగా పాట చాలా అందంగా ఉందని అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.

ఈ పాట ‘ది గర్ల్‌ఫ్రెండ్‌’ చిత్రంపై అంచనాలను మరింత పెంచింది. హేషమ్‌ అబ్దుల్‌ వహాబ్‌ సంగీతం, రాకేందు మౌళి సాహిత్యం, రష్మిక, దీక్షిత్‌ల అభినయం కలగలిసి ఈ పాట ఒక ప్రేమ గీతంగా శ్రోతల హృదయాలను గెలుచుకుంది. త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా కోసం అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ‘ది గర్ల్ ఫ్రెండ్’ సినిమా థియేటర్లలో ఎలాంటి మ్యాజిక్ చేస్తుందో చూడాలి మరి. 

©️ VIL Media Pvt Ltd.
Disclaimer : This story is auto aggrigated by a computer program and has not been created or edited by this website. All copyrights related to this news are owned by those websites. This website is not to be held responsible for any of the content displayed.