
తెలంగాణ, ఏపీ రాష్ట్రాల మధ్య ఉన్న నీటి కేటాయింపులు, వాటాలు, కొత్త ప్రాజెక్టుల అంశంపై ఢిల్లీలో కీలక సమావేశం.. 2025, జూలై 16వ తేదీ మధ్యాహ్నం ఢిల్లీలోని కేంద్ర జలశక్తి శాఖ ఆధ్వర్యంలో.. కేంద్ర జలశక్తి మంత్రి పాటిల్ ఆధ్వర్యంలో ఈ భేటీ జరిగింది. ఈ సమావేశానికి తెలుగు రాష్ట్రాల సీఎంలు రేవంత్ రెడ్డి, చంద్రబాబు హాజరయ్యారు. వీరితోపాటు తెలంగాణ, ఏపీ ఇరిగేషన్ మినిస్టర్స్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, రామానాయుడు కూడా హాజరయ్యారు ఈ సమావేశానికి. తెలంగాణ పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ సైతం ఈ సమావేశంలో.. కేంద్ర జలశక్తి మంత్రి పాటిల్ ను కలిశారు.
జలశక్తి ఆధ్వర్యంలోని ఈ భేటీలో కీలక అంశాలు :
ఏపీ బనకచర్లపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ.. ఏపీ ప్రభుత్వం బనకచర్ల అంశాన్ని ప్రస్తావించొద్దు అని ఇప్పటికే ఖరాఖండిగా తేల్చిచెప్పిన తెలంగాణ ప్రభుత్వం.. మిగతా అంశాలపై చర్చించాలని కోరింది. కృష్ణా జలాల్లో న్యాయమైన వాటాలు, గోదావరి, కృష్ణా నదులపై కట్టిన, కడుతున్న ప్రాజెక్టులకు అనుమతులు, తుమ్మిడిహెట్టిని ఏఐబీపీ కింద నిర్మించాలన్న తెలంగాణ విజ్ఞప్తులను పరిగణనలోకి తీసుకుని వాటిపై చర్చించాలని కోరింది.
ఇటు ఇచ్చంపల్లి దగ్గర 200 టీఎంసీల వరద జలాల వినియోగానికి కొత్త ప్రాజె క్టు నిర్మాణం తదితర అంశాలు సమావేశంలో చర్చకు వచ్చాయి.