. 3 minutes

WI vs AUS: ఒక్క హాఫ్ సెంచరీ లేదు.. 516 పరుగులు.. 40 వికెట్లు: ఆసీస్, విండీస్ టెస్టులో 5 మిరాకిల్స్

Caption of Image.

జమైకాలో కింగ్ స్టన్ వేదికగా సబీనా పార్క్ లో వెస్టిండీస్, ఆస్ట్రేలియా జట్ల మధ్య జరిగిన మూడో టెస్ట్ మ్యాచ్ లో బౌలర్లు వికెట్ల వర్షం కురిపించారు. బౌలర్లు విజృంభించి రెండున్నర రోజుల్లోనే 40 వికెట్లు కూల్చారు. ఈ టెస్టులో ఆస్ట్రేలియా బౌలర్లు అత్యద్భుతంగా చెలరేగడంతో వెస్టిండీస్ రెండో ఇన్నింగ్స్ లో కేవలం 27 పరుగులకే ఆలౌట్ అయింది. ఆధ్యంతం బౌలర్లు ఆధిపత్యం చూపించిన ఈ మ్యాచ్ లో వెస్టిండీస్ పై ఆస్ట్రేలియా 176 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్ చెప్పుకోవాలంటే చాలానే విశేషాలు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం.. 

పదేళ్ల తర్వాత తొలిసారి:

ఈ టెస్ట్ మ్యాచ్ లో నాలుగు ఇన్నింగ్స్ ల్లో ఒక్క హాఫ్ సెంచరీ కూడా నమోదు కాలేదు. స్టీవ్ స్మిత్ చేసిన 48 పరుగులు అత్యధికం. 2015 తర్వాత ఇలా జరగడం ఐదు తొలిసారి. నాగ్ పూర్ వేదికగా ఇండియా, సౌతాఫ్రికా జట్ల మధ్య జరిగిన ఈ టెస్టులో ఒక్క హాఫ్ సెంచరీ కూడా ఎవరు కొట్టలేకపోయారు. టీమిండియా ఓపెనర్ మురళీ విజయ్ చేసిన 40 పరుగులు అత్యధికం. ఈ మ్యాచ్ లో భారత్ 124 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. 

Also Read:-8 ఏళ్ళ తర్వాత రీ ఎంట్రీ: నాలుగో టెస్టుకు ఇంగ్లాండ్ స్క్వాడ్ ప్రకటన

విండీస్ టెస్ట్ చరిత్రలో అత్యల్ప స్కోర్:

ఈ టెస్ట్ రెండో ఇన్నింగ్స్ లో వెస్టిండీస్ కేవలం 27 పరుగులే ఆలౌట్ అయింది. స్టార్క్ ఆరు వికెట్లతో చెలరేగడంతో పాటు బోలాండ్ హ్యాట్రిక్ తీయడంతో 205 పరుగుల లక్ష్య ఛేదనలో వెస్టిండీస్ కేవలం 27 పరుగులకే ఆలౌటై తమ టెస్ట్ క్రికెట్ చరిత్రలో అత్యల్ప స్కోర్ నమోదు చేసింది. ఓవరాల్ గా టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఇది రెండో అత్యల్ప స్కోర్. 

Lowest innings total in Tests by all teams!🏏📉 pic.twitter.com/eVB1tQIQul

— CricketGully (@thecricketgully) July 15, 2025

బోలాండ్ హ్యాట్రిక్:

ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ స్కాట్ బోలాండ్ హ్యాట్రిక్ తో చెలరేగాడు. రెండో ఇన్నింగ్స్ లో ఈ ఆసీస్ పేసర్ ఈ ఘనతను అందుకున్నాడు. దీంతో పింక్ బాల్ టెస్ట్ లో హ్యాట్రిక్ తీసిన తొలి బౌలర్ గా చరిత్ర సృష్టించాడు. జస్టిన్ గ్రీవ్స్, షమర్ జోసెఫ్, జోమెల్ వారికన్‌లను వరుస బంతుల్లో బోలాండ్ ఔట్ చేశాడు. దీంతో 2010 తర్వాత టెస్ట్ ఫార్మాట్ లో హ్యాట్రిక్ తీసిన తొలి ఆసీస్ బౌలర్ గా నిలిచాడు.

If Scott Boland had played for another team, he would be having 500 wickets today. pic.twitter.com/3YcGjGMqPk

— Bash (@bashhh_24) July 15, 2025

స్టార్క్ వరల్డ్ రికార్డ్:

ఈ టెస్ట్ రెండో ఇన్నింగ్స్ లో స్టార్క్ తన బౌలింగ్ తో విజృంభించి కేవలం 15 బంతుల్లోనే ఐదు వికెట్లు పడగొట్టి ప్రపంచ రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. దీంతో టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఫాస్టెస్ట్ 5 వికెట్లు పడగొట్టిన ప్లేయర్ గా చరిత్ర సృష్టించాడు. అంతకముందు  టెస్టుల్లో ఈ రికార్డ్ ఎర్నీ టోషాక్ (ఆస్ట్రేలియా), స్టువర్ట్ బ్రాడ్ (ఇంగ్లాండ్) , స్కాట్ బోలాండ్ (ఆస్ట్రేలియా) పేరిట ఉంది.  ఈ ముగ్గురు 19 బంతుల్లో 5 వికెట్లను పడగొట్టారు. తాజాగా స్టార్క్ ఈ రికార్డ్ ను అధిగమించి టాప్ కు చేరాడు.

ఓవరాల్ గా  7.3 ఓవర్లలో కేవలం 9 పరుగులే ఇచ్చిన స్టార్క్.. ఆరు వికెట్లు పడగొట్టాడు. స్టార్క్ తన తొలి ఓవర్ లోనే మూడు వికెట్లు పడగొట్టడం విశేషం. దీంతో పాటు ఈ మ్యాచ్ లో స్టార్క్ టెస్ట్ క్రికెట్ లో 400 వికెట్లను పూర్తి చేసుకొని ఈ ఘనత సాధించిన రెండో ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ గా ఓవరాల్ గా నాలుగో ఆసీస్ బౌలర్ గా నిలిచాడు. స్టార్క్ ఆరు వికెట్లతో విజృంభించడంతో విండీస్ జట్టు ఏ దశలోనూ కోలుకోలేకపోయింది. 

Mitchell Starc has five wickets in just 2.3 overs!

That’s the quickest for any bowler to take a five-for in a Test innings 🤯 #WIvAUS pic.twitter.com/aLpJv44jfi

— ESPNcricinfo (@ESPNcricinfo) July 14, 2025

ఏడుగురు డకౌట్స్:

రెండో ఇన్నింగ్స్ లో ఏకంగా ఏడుగురు వెస్టిండీస్ క్రికెటర్లు డకౌట్ కావడం  షాకింగ్ కు గురి చేస్తుంది. 148 ఏళ్ళ టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఒక ఇన్నింగ్స్ లో ఏడుగురు డకౌట్ కావడం ఇదే తొలిసారి. అంతకముందు అత్యధికంగా ఆరుగురు డకౌటైన రికార్డును విండీస్ చెత్త రికార్డ్ తమ ఖాతాలో వేసుకుంది. జాన్ కాంప్‌బెల్, కెవెలాన్ ఆండర్సన్, బ్రెండన్ కింగ్, రోస్టన్ చేజ్, షెమర్ జోసెఫ్, జోమెల్ వారికన్, జేడెన్ సీల్స్ ఈ మ్యాచ్ లో డకౌటయ్యారు. 

A record 7 ducks in West Indies’ 27 all out

▶️ https://t.co/Tt6fRCCwAE #WIvAUS pic.twitter.com/CdvhBH4Tal

— ESPNcricinfo (@ESPNcricinfo) July 14, 2025

ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్ లో ఆస్ట్రేలియా 225 పరుగులకు ఆలౌట్ అయింది. స్మిత్ 48 పరుగులు చేసి టాప్ స్కోరర్ గా నిలిచాడు. షామర్ జోసెఫ్ 4 వికెట్లతో చెలరేగాడు. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన వెస్టిండీస్ 143 పరుగులకే ఆలౌట్ అయింది. దీంతో తొలి ఇన్నింగ్స్ లో ఆస్ట్రేలియాకు 82 పరుగుల ఆధిక్యం లభించింది. రెండో ఇన్నింగ్స్ లో ఆస్ట్రేలియా 121 పరుగులకే ఆలౌట్ అయింది. 205 పరుగుల లక్ష్య ఛేదనలో వెస్టిండీస్ 27 పరుగులకు ఆలౌట్ అయింది. ఫాస్ట్ బౌలర్ మిచెల్ స్టార్క్ కే ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్, ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డులు లభించాయి. 

©️ VIL Media Pvt Ltd.
Disclaimer : This story is auto aggrigated by a computer program and has not been created or edited by this website. All copyrights related to this news are owned by those websites. This website is not to be held responsible for any of the content displayed.