. 2 minutes

Mitchell Starc: 15 బంతుల్లో 5 వికెట్లు.. 100వ టెస్టులో స్టార్క్ వరల్డ్ రికార్డ్

Caption of Image.

ఆస్ట్రేలియా స్టార్ ఫాస్ట్ బౌలర్ మిచెల్ స్టార్క్ తన 100వ టెస్టును స్వీట్ మెమరీగా మార్చుకున్నాడు. వెస్టిండీస్‌తో కింగ్ స్టన్ సబీనా పార్క్ లో ముగిసిన మూడో టెస్ట్ తో 100 టెస్టులాడి అరుదైన ఘనత అందుకోవడమే కాదు.. ఏకంగా వరల్డ్ రికార్డుతో చెలరేగాడు. 205 పరుగుల లక్ష్య ఛేదనలో వెస్టిండీస్ జట్టుపై తన ప్రతాపం చూపించాడు. రెండో ఇనింగ్స్ తన తొలి స్పెల్‌లో కేవలం 15 బంతుల్లోనే ఐదు వికెట్లు పడగొట్టి ప్రపంచ రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. దీంతో టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఫాస్టెస్ట్ 5 వికెట్లు పడగొట్టిన ప్లేయర్ గా చరిత్ర సృష్టించాడు.

అంతకముందు టెస్టుల్లో ఈ రికార్డ్ ఎర్నీ టోషాక్ (ఆస్ట్రేలియా), స్టువర్ట్ బ్రాడ్ (ఇంగ్లాండ్) , స్కాట్ బోలాండ్ (ఆస్ట్రేలియా) పేరిట ఉంది.  ఈ ముగ్గురు 19 బంతుల్లో 5 వికెట్లను పడగొట్టారు. తాజాగా స్టార్క్ ఈ రికార్డ్ ను అధిగమించి టాప్ కు చేరాడు. ఓవరాల్ గా  7.3 ఓవర్లలో కేవలం 9 పరుగులే ఇచ్చిన స్టార్క్.. ఆరు వికెట్లు పడగొట్టాడు. ఈ మ్యాచ్ ద్వారా స్టార్క్ టెస్ట్ క్రికెట్ లో 400 వికెట్లను పూర్తి చేసుకొని ఈ ఘనత సాధించిన రెండో ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ గా ఓవరాల్ గా నాలుగో ఆసీస్ బౌలర్ గా నిలిచాడు. స్టార్క్ ఆరు వికెట్లతో విజృంభించడంతో విండీస్ జట్టు ఏ దశలోనూ కోలుకోలేకపోయింది. తొలి ఓవర్లోనే మూడు వికెట్లు పడగొట్టాడు.

స్టార్క్ తో పాటు బోలాండ్ హ్యాట్రిక్ తీయడంతో 205 పరుగుల లక్ష్య ఛేదనలో వెస్టిండీస్ కేవలం 27 పరుగులకే ఆలౌటై తమ టెస్ట్ క్రికెట్ చరిత్రలో అత్యల్ప స్కోర్ నమోదు చేసింది. దీంతో ఆస్ట్రేలియా 176 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్ లో ఆస్ట్రేలియా 225 పరుగులకు ఆలౌట్ అయింది. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన వెస్టిండీస్ 143 పరుగులకే ఆలౌట్ అయింది. రెండో ఇన్నింగ్స్ లో ఆస్ట్రేలియా 121 పరుగులకే ఆలౌట్ అయింది. 205 పరుగుల లక్ష్య ఛేదనలో వెస్టిండీస్ 27 పరుగులకు ఆలౌట్ అయింది. స్టార్క్ కే ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్, ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డులు లభించాయి. 

ALSO READ : Yash Dayal: RCB పేసర్‌కు భారీ ఊరట.. అరెస్ట్ చేయొద్దంటూ స్టే ఇచ్చిన హైకోర్టు

టెస్ట్ క్రికెట్ చరిత్రలో అత్యంత వేగవంతమైన ఐదు వికెట్ల ఘనతలు

మిచెల్ స్టార్క్ (ఆస్ట్రేలియా) – 2025లో వెస్టిండీస్‌పై 15 బంతులు

ఎర్నీ టోషాక్ (ఆస్ట్రేలియా) – 1947లో భారత్‌పై 19 బంతులు

స్టువర్ట్ బ్రాడ్ (ఇంగ్లాండ్) – 2015లో ఆస్ట్రేలియాపై 19 బంతులు

స్కాట్ బోలాండ్ (ఆస్ట్రేలియా) – 2021లో ఇంగ్లాండ్‌పై 19 బంతులు

షేన్ వాట్సన్ (ఆస్ట్రేలియా) – 2021లో దక్షిణాఫ్రికాపై 21 బంతులు

– 100th Test match. ✅
– Player of the Series. ✅
– Player of the match. ✅
– 400 wickets in Tests. ✅
– Five wicket haul in just 15 balls. ✅

MITCHELL STARC MADNESS AT JAMAICA…!!! pic.twitter.com/m3AbEJDBqR

— Johns. (@CricCrazyJohns) July 15, 2025

©️ VIL Media Pvt Ltd.
Disclaimer : This story is auto aggrigated by a computer program and has not been created or edited by this website. All copyrights related to this news are owned by those websites. This website is not to be held responsible for any of the content displayed.